చిక్కని చిరుత.. బోను వరకు వచ్చి వెళుతుండటంతో?

శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే పై కనిపించిన చిరుత కోసం ఇంకా అటవీశాఖ అధికారులు గాలిస్తూనే ఉన్నారు.

Update: 2024-05-01 06:07 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే పై కనిపించిన చిరుత కోసం ఇంకా అటవీశాఖ అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లోనే చిరుత తిరుగుతున్నట్లు ట్రాప్ కెమెరాల్లో గుర్తించారు. అయితే ఇది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుండటం, అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్ల వరకూ వచ్చి పోతుండటం వల్ల కూడా చిరుత చిక్కడం లేదు.

బోన్లలో మేకలను...
గత నాలుగురోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు రన్ వే చిరుత కన్పించింది. ఫెన్సింగ్ దూకిన వెంటనే అలారం మోగడంతో అప్రమత్తమయిన అధికారులు చిరుతను గుర్తించారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇరవై ట్రాప్ కెమెరాలను, ఐదు బోన్లను ఏర్పాటు చేశారు. బోన్లలో మేకలను ఎరగా ఉంచినా అక్కడకు వచ్చి చిరుత వెనుదిరిగి వెళ్లిపోతుండటంతో ఏమీచేయలేకపోతున్నారు. చిరుత కోసం ఇంకా వేట కొనసాగుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News