Gold Rates Today : బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదుగా... ఇక కొనుగోలు చేసేది ఎలా?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి;

బంగారం ధరలు మండు వేసవిలో ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. గరిష్టంగా ధరలు నమోదు అవుతున్నాయి. గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరల్లో పెరుగుదల తప్ప తగ్గుదల అనేది లేదు. దీంతో వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బంగారం అనేది కొనుగోలు చేయడానికి అవసరమైన అందుబాటులో ఉంటే ఎక్కువ మంది కొనుగోలు చేసే అవకాశముంది. అదే ధరలు అదుపు తప్పి ఎక్కువగా ఉంటే కొందరు మాత్రమే కొనుగోలు చే్స్తారు. తద్వారా అమ్మకాలు మందగిస్తాయి. వ్యాపారాలు కూడా సక్రమంగా జరగవు. ఇవన్నీ వ్యాపారంలోని సహజ సూత్రాలు.
ఎవరి చేతులో లేకపోయినా...
సహజంగా బంగారం, వెండి ధరలు అదుపు చేయడం ఎవరి చేతుల్లో ఉండదు. అంతర్జాతీయ ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కూడా బంగారం మార్కెట్ పై ప్రభావం చూపాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెరిగినప్పుడు ఎక్కువ మొత్తంలోనూ, తగ్గినప్పుడు తక్కువ మొత్తంలో ధరలు తగ్గడం బంగారం, వెండి విషయంలోనే చూస్తాం. వెండి కూడా కిలో లక్షరూపాయలు దాటేసి వినియోగదారులను వెక్కిరిస్తుంది. పది గ్రాముల బంగారం ధర 93 వేల రూపాయలుకు చేరుకుంది. అయితే ఈ ఏడాది లక్షకు చేరుకునే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ధరలు ఇలా...
బంగారం, వెండి సొంతం చేసుకోవాలని అందరూ భావిస్తారు. కలలు కంటారు. పొదుపు చేసిన మొత్తంతో బంగారం కొనుగోలుకే విక్రయిస్తుంటారు. కానీ తామ పొదుపు చేసిన మొత్తంతో కనీస స్థాయిలో కూడా బంగారం, వెండి రాకపోవడంతో ఇతరాలపై మదుపు చేయడం మంచిదని భావిస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి, హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశముంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 85,610 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 93,390 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,11,900 రూపాయలుగా కొనాగుతుంది.