Ramadan : నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయింది. నేటి నుంచి ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి.
Ramadan :పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయింది. నేటి నుంచి ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెల ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లో పాతబస్తీ అనేక సొబగులు అద్దుకుంది. ముప్పయి రోజుల పాటు నియమ నిష్టలతో ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేేస్తారు. ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఉపవాసం చేస్తారు. తర్వాత ఇఫ్తార్ తో ముగించనున్నారు.
ప్రత్యేక ప్రార్థనలు...
ప్రతి రోజూ మసీదుకు వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు జరుపుతారు. ఈ నెల రోజుల పాటు ఖురాన్ పఠనంతో ముస్లింలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతారు. పేదలకు అన్నదానాలతో పాటు వస్త్రదానాలు వంటివి చేస్తారు. రంజాన్ నెల ప్రారంభం కావడంతో హైదరాబాద్ నగరంలో మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉదయం, సాయంత్రం వేళ ప్రార్థనలకు ముస్లిం సోదరులు వస్తుండటంతో అక్కడ పోలీసులను కూడా పహారా ఉంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునే వీలుగా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వాలు చేశాయి.