సోషల్ మీడియాలో జరుగుతుంది ఉత్తుత్తి ప్రచారమే
నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఈ నెల 28వ తేదీ నుంచి కఠినతరం చేస్తున్నామని హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాధ్ తెలిపారు
నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఈ నెల 28వ తేదీ నుంచి కఠినతరం చేస్తున్నామని హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాధ్ తెలిపారు. ఇవి కొత్తగా అమలులోకి పెడుతున్న నిబంధనలు కావన్నారు. 2013 మోటార్ వెహికల్ యాక్ట్ లో ఉన్నవేనని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామని ఆయన అన్నారు.
నిబంధనలను కఠినతరం...
గతంలో కన్నా నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాను తగ్గించామని ఆయన తెలిపారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపితే రూ.1700లు, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ల ఫైన్ వేస్తామని ఆయన తెలిపారు. ఎక్కడ రాంగ్ రూట్ లో వాహనాలు ఎక్కువగా వెళుతున్నాయో అక్కడ పోలీస్ ఎన్ ఫోర్స్ మెంట్ ను పెడతామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడం జరిమానాలను విధించడం లేదన్నారు. వాహనదారుల్లో ట్రాఫిక్ ఆంక్షల పట్ల అవగాహన కల్పిస్తామని రంగనాధ్ తెలిపారు.