Hydra : మూసీ నది ఆక్రమణపై హైడ్రా కమిషనర్ సంచలన ప్రకటన
మూసీ నది ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ సంచలన ప్రకటన చేశారు.;

Hydra commissioner ranganadh
మూసీ నది ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ సంచలన ప్రకటన చేశారు. నదికి ఇరువైపుల జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరివాహక పరిధిలో నివసిస్తున్న వారిని కూడా హైడ్రా తరలించడం లేదని ఆయన తెలిపారు. నదిలో ఎలాంటి కూల్చివేతలను తాము చేపట్టడం లేదని ఆయన వివరించారు.
అది తమ పనికాదు...
నదీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై కూడా హైడ్రామార్కింగ్ చయడం లేదని కమిషనర్ రంగనాధ్ తెలిపారు. ముసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్టు అని, ఆ మార్కింగ్ తొలగింపు అనేది మూసీ రివర్ ఫ్రంట్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి కూల్చివేతలకు, మార్కింగ్ లకు, నోటీసులకు హైడ్రాకు ఆపాదించడం సరికాదని తెలిపారు.