Gold Price Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. వెండి కొనేవారికి బ్యాడ్ టైం
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర మాత్రం పెరిగింది.;
బంగారం ధరలు కొంత మేర దిగివస్తున్నాయి. కొనుగోళ్లపై ప్రభావం చూపుతుండటంతో ధరలు దిగిరాక తప్పడం లేదు. ఎందుకంటే సీజన్ లోనూ కొనుగోళ్లు తగ్గడానికి ధరలు అమాంతం పెరగడమే కారణమని భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆశించిన రీతిలో మాత్రం కాదు. ఏదో తగ్గాయంటే తగ్గాయనిపించే తరహాలో దిగివస్తుండటం కొనుగోలుదారులను ఎంత మేరకు ఆకట్టుకుంటారో మాత్రం తెలియడం లేదు. ధరలు భారీగా పెరిగినప్పుడు కొనుగోళ్లు తగ్గడం మామూలేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతకాలమో కొనుగోళ్లపై ప్రభావం చూపదని, మళ్లీ అమ్మకాలు ఊపందుకుంటాయని అంటున్నారు.
డిమాండ్ తగ్గకపోవడంతో...
బంగారం అంటే అంతే మరి. ప్రతి రోజూ మార్పులు, చేర్పులు ధరల్లో కనిపిస్తుంటాయి. ఇలా పెరుగుతూ పోతుంటే బంగారం ఒక వర్గం వారికే పరిమితమవుతుందన్న భావన అందరిలోనూ నెలకొంది. బంగారం మన వద్ద ఉంటే బతుకు భద్రంగా ఉంటుందని నమ్ముతారు. అందుకే దీనికి ఎక్కువ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తగ్గడమనేది జరగదు. డిమాండ్ పెరిగే కొద్దీ ధరలు పెరగడం సహజమేనని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా పెరగడంతో ధరలు పెరిగినా బంగారం కొనుగోలు విషయంలో వెనకడుగు వేయడం లేదు. అలాగే పెట్టుబడి పెట్టే వారు కూడా బంగారంపైనే ఎక్కువగా మదుపు చేస్తుండటంతో బంగారం ధరలు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముంది.
వెండి ధరలు పెరిగి...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా సామాన్యులకు అందకుండా పోయాయి. మరో విషయం ఏంటంటే.. వెండి ధరలు మళ్లీ లక్షకు చేరుకున్నాయి. కిలో వెండి ధరల లక్ష కు చేరుకోవడంతో వెండి కొనుగోలు చేసే వారికి ఒకింత నిరాశ అని చెప్పాలి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధర మాత్రం పెరిగింది. ఉదయం ఆరు గంటలవరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,140 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,700 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,00,000 రూపాయలు పలుకుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now