Telangana : ఏసీబీ సోదాలు.. వారి ఇళ్లలోనూ

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.;

Update: 2025-01-07 07:20 GMT

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. హైకోర్టులో ఈ ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటీషన్ కొట్టి వేసిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.హైదరాబాద్ లో మొత్తం పది చోట్ల ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలను నిర్వహిస్తున్నారు.

ఫార్ములా ఈ కారు రేసు కేసులో....
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏ2గా అరవింద్ కుమార్ ఉన్నారు. ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. వారి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఈడీ విచారణకు అరవింద్ కుమార్ ఈ కేసులో హాజరవుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారుల ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కీలక డాక్యుమెంట్ల కోసం సోదాలను నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 

Tags:    

Similar News