Gold Price Today : మరోసారి షాకిచ్చిన బంగారం ధరలు..శాంతించిన వెండి
ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి;
బంగారం ధరలు ఎప్పుడూ ప్రియంగానే ఉంటాయి. ధరలు పెరుగుదల నిత్యం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతుంటాయి. పెరిగినప్పుడు బంగారం ధరలు భారీగా, తగ్గినప్పుడు స్వల్పంగానే ధరలు ఉంటాయి. అందుకే బంగారం ధరలు తగ్గాయన్న సంతోషం కూడా వినియోగదారుల్లో ఎక్కువ మందికి ఉండదు. అలాగే పెరిగినప్పుడు ఉన్న ధర తగ్గినప్పుడు తగ్గకపోవడం కూడా అనేక మంది మదుపరులను సంతోషపెట్టినప్పటికీ, అవసరం నిమిత్తం కొనుగోలు చేసే వారికి మాత్రం నిరాశ కలుగుతుంది. పసిడి ధరలు ఇప్పటికే కొనుగోలుదారుల అంచనాలకు మించి పెరిగిపోయిన నేపథ్యంలో మరింత పెరిగే అవకాశముందని కూడా చెబుతున్నారు.
ప్రతి రోజూ పెరుగుతూ...
మరొక వైపు ధరలు పెరుగుదల నిత్యం జరుగుతూనే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో పాటు విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు కూడా కారణమని ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. వెండి ధరలు కూడా లక్ష రూపాయలకు చేరువలో ఉన్నాయి. బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం అమ్మకాలపై పడిందని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మంచి సీజన్ లో కొనుగోళ్లు పెద్దగా జరగలేదని, గతంతో పోలిస్తే ఇరవై శాతం అమ్మకాలు తగ్గాయన్నది వ్యాపారులు చెబుతున్న మాట. రానున్న కాలంలో ఇంకా అమ్మకాలు పడిపోతాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది.
స్వల్పంగా పెరిగి...
ఇలా ధరలు పెరుగుతూ పోతుంటే బంగారం, వెండి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారన్నది వ్యాపారులే అంగీకరిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడి లాభాన్ని తెచ్చిపెడుతుందని, ఎట్టిపరిస్థితుల్లో నష్టం రాదని, అందువల్ల ధరలు పెరిగినా కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు మార్కెట్ నిపుణుల నుంచి వెలువడుతున్నాయి. ఈరోజు బంగారం ధరలు దేశంలో స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,260 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 78,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 99,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.