Hyderabad : హైదరాబాద్ లో గంట నుంచి పడుతున్న భారీ వర్షం

హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. దాదాపు గంట సేపు నుంచి వర్షం పడుతుంది.;

Update: 2024-06-05 12:42 GMT

హైదరాబాద్ లో వర్షం కురుస్తుంది. దాదాపు గంట సేపు నుంచి వర్షం పడుతుంది. గంట నుంచి భారీ వర్షం పడుతుండటంతో రోడ్లపైకి నీళ్లు చేరాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. వర్షం ఎంతసేపు పడుతుందో తెలియకపోవడంతో విధులు ముగించుకుని ఇంటికి చేరాలనుకుంటున్న ఉద్యోగులు ఆఫీసులకే పరిమితమయ్యారు.

ట్రాఫిక్ సమస్యలు...
కార్లలో వచ్చేవారు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. పోలీసులు రహదారులపై ట్రాఫిక్ స్థంభించిన ప్రాంతాల్లో క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మ్యాన్ హోల్ మూతలను తెరిచి జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని పంపే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో మోటార్లతో నీళ్లను తోడుతున్నారు. అకాల వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు


Tags:    

Similar News