Telangana : మరికాసేపట్లో సీఎంల సమావేశం.. ప్రజాభవన్ వద్ద సీన్ ఇదే
మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభం కానుంది;
మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభం కానుంది. ప్రజా భవన్ వేదిక గా కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రులు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటివద్దకు చేరుకున్నారు. అందరూ కలసి ప్రజాభవన్ కు బయలుదేరనున్నారు. ఈ సమావేశంలో గత పది సంవత్సరాల గా పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చ జరగనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు కీలక సమావేశం జరగనుండటంతో ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఎవరినీ అనుమతించక...
విజిటర్స్ ను ఎవరినీ ఆ పరిసర ప్రాంతానికి అనుమతించడం లేదు. ఇప్పటికే ప్రజా భవన్ వద్దకు తెలుగు మీడియా తో పాటు జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు భారీగా చేరుకున్నారు. పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. కేవలం ఏపీ, తెలంగాణ మంత్రులతో పాటు ఉన్నతాధికారులను మాత్రమే ప్రజాభవన్ లోనికి అనుమతిస్తున్నారు. ప్రజా ప్రతినిధులకు కూడా అనుమతి లేదని చెబుతున్నారు. ఈ సమావేశం పట్ల ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.