హైదరాబాదీలకు గుడ్ న్యూస్

ఎల్బీ నగర్ కూడలి వద్ద నిర్మించిన మరో ఫ్లై ఓవర్ ను ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు;

Update: 2023-03-25 04:01 GMT
హైదరాబాదీలకు గుడ్ న్యూస్
  • whatsapp icon

నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఫ్లై ఓవర్లను నిర్మిస్తూ రవాణాను సులభతరం చేస్తుంది. ఇప్పటికే అనేక ఫ్లై ఓవర్లు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో ఫ్లైఓవర్‌ను నేడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

ఎల్బీనగర్ వద్ద....
వనస్థలిపురం - దిల్‌సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీ నగర్ కూడలి వద్ద నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ను ఈరోజు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కేటీఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనదారులకు ప్రయాణం మరింత సులువుగా మారనుంది. 32 కోట్ల రూపాయలతో ఈ ఫ్లై ఓవర్ ను నిర్మించారు.


Tags:    

Similar News