Hyderabad : పాతబస్తీలో తాట తీస్తున్న పోలీసులు.. రాత్రి పన్నెండు దాటితే?
హైదరాబాద్ లోని పాతబస్తీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు;
హైదరాబాద్ లోని పాతబస్తీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరస హత్యలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు పాతబస్తీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల ప్రాంతంలో రాత్రి వేళ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో సహజంగా తెల్లవారు జాము వరకూ యువకులు తిరుగుతూనే ఉంటారు. కొన్ని ఫుడ్ సెంటర్లు కూడా ఓపెన్ అయి ఉంటాయి.
వరస హత్యలతో...
అయితే వరస హత్యలు జరుగుతుండటంతో రాత్రి పదకొండు గంటలు దాటితే పాతబస్తీ ప్రాంతంలో తిరిగే వారిపై కొరడాను ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత యువకులు రోడ్లపైన కనిపిస్తే వాహనాలను తనిఖీ చేయడంతో పాటు వారిని కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆకతాయిలపై లాఠీలు ఝుళిపిస్తూ ఇళ్లకు వెళ్లాల్సిందిగా హుకుం జారీ చేస్తున్నారు. అనుమానితులను కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు.