Hyderabad : గచ్చిబౌలిలో మంగళవారం ట్రాఫిక్ చూశారా?
సైబరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు ఎప్పుడూ తలెత్తుంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.
సైబరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలు ఎప్పుడూ తలెత్తుంటాయి. ఎన్ని మెట్రో రైళ్లు వేసినా గచ్చిబౌలి, హైటెక్ సిటీ రూట్లలో ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. వీకెండ్ కాకుండా అటు వెళ్లిన వారికి నరకం తప్పదు. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవాల్సిందే. ప్రజారవాణా వ్యవస్థను ఉపయోగించుకునే వాళ్లు తక్కువ. సొంత వాహనాలను వినియోగించుకునే వాళ్లు ఎక్కువ కావడంతో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడే అవకాశాలే కనిపించడం లేదు. ట్రాఫిక్ పోలీసుల వల్ల కూడా కావడం లేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ లో తప్పడం లేదు.
ట్రాఫిక్ పోలీసులు...
ట్రాఫిక్ పోలీసులు నిరంతరం క్రమబద్దీకరించే యత్నం చేస్తున్నప్పటికీ నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. మంగళవారం బొటానికల్ గార్డెన్స్ ేనుంచి గచ్చిబౌలి వైపు వెళ్లి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. లెక్కకు మించి వాహనాలు రోడ్లపైకి రావడంతో చాలా సేపు వాహనాలు నెమ్మదిగా కదిలాయి. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు అందుబాటులో ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అయినా పరిస్థితి మాత్రం అదుపులోకి రావడానికి చాలా సమయం పట్టింది. ప్రజలు ఇప్పటికైనా సొంత వాహనాలు మాని, ప్రజారవాణా వ్యవస్థను వినియోగించాలని పోలీసులు కోరుతున్నారు.