తొక్కిసలాట.. పదుల సంఖ్యలో చిన్నారుల మృతి

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగిన తొక్కిసలాటలో విద్యార్థులు మరణంచినట్లు అధికారులు తెలిపారు.

Update: 2024-12-19 01:25 GMT

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలలో జరిగిన తొక్కసలాటలో అనేక మంది విద్యార్థులు మరణంచినట్లు అధికారులు తెలిపారు. హాలిడే ఫెయిర్ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో విద్యార్ధులు మరణించారని చెబుతున్నారు. ఓయో రాష్ట్ర గవర్నర్ ఈ విషయాన్ని ధృవకీరించారు. నైజారియాలోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల నిర్వహించిన హాలిడే ఫెయిర్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది.

హాలిడే ఫెయిర్ జరుగుతుండగా...
ఈ తొక్కిసలాటలో చిన్నారులు కొందరుమరణించినట్లు తెలిపారు. ఓయో రాష్ట్రంలోని ఇస్తామిక్ స్కూల్ లో జరిగిన ఈ ఘటన దేశంలోనే విషాదం నింపింది. సమాచారం తెలిసిన వెంటనే భద్రతాదళాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఎంత మంది మరణించారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషాదఘటనను నుంచి తేరుకోవడం కష్టమేనని, తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతిని ఓయో గవర్నర్ ప్రకటించారు.


Tags:    

Similar News