అమెరికాను వణికిస్తున్న హరికేన్ మిల్టన్
అమెరికాను హరికేన్ మిల్టన్ వణికిస్తుంది. ఫ్లోరిడా హరికేన్ మిల్టన్ దెబ్బకు అతలాకుతలమయింది
అమెరికాను హరికేన్ మిల్టన్ వణికిస్తుంది. ఫ్లోరిడా హరికేన్ మిల్టన్ దెబ్బకు అతలాకుతలమయింది. నిన్న రాత్రి భయంకరమైన ఈదురు గాలులు వీచాయి. భారీ వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే దీనిని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 3 తుపానుగా నేషనల్ హరికేన్ సెంటర్ ప్రకటించింది.
తీరం దాటడంతో....
తుపాను సియాస్టాకీ వద్ద తీరాన్ని తాకిందని తెలిపింది. దీంతో ఫ్లోరిడాలో వీధులన్నీ జలమయయ్యాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వాహనాలు వర్షపు నీటితో కొట్టుకు పోయాయి. హరికేన్ మిల్టన్ తో ఆస్తి నష్టం బాగానే జరిగి ఉంటుందని అధికారులు ప్రాధమిక అంచనాలను రూపొందించారు. ప్రాణ నష్టం మాత్రం పెద్దగా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు.