Earth Quake : న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా రికార్డు గా నమోదయింది;

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.8గా రికార్డు గా నమోదయింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరగుులు తీశారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 7.15 గంటల ప్రాంతంలో న్యూజిలాండ్ పశ్చిమ- నైరుతి తీర ప్రాంత పట్టణం రివర్టన్ సమీపంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.
రిక్టర్ స్కేల్ పై...
రివర్టన్, అపర్ణియాకు 159 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.