అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు కరోనా

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కరోనా వైరస్ బారిన పడ్డారు.;

Update: 2024-07-18 01:53 GMT
joe biden, president, america, corona virus
  • whatsapp icon

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. స్వల్పంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలు రావడంతో ఆయనకు పరీక్షలు చేయగా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ బారిన పడ్డారని వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసింది. మరో మూడు నెలల్లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న సమయంలో, ప్రచారం ముమ్మరంగా చేయాల్సిన టైంలో బైడెన్ కోవిడ్ బారిన పడటంతో ఆయన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

ఐసొలేషన్ లో ఉండి...
ఆయన ప్రస్తుతం డెలావేర్ లోని తన ఇంట్లో ఐసొలేషన్ లో ఉన్నారని తెలిపారు. కోవిడ్ కు సంబంధించిన మందులు తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోతే తాను అధ్యక్ష బరి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన కోవిడ్ బారిన పడటంతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News