మయన్మార్ లో 2700 కు పెరిగిన మృతుల సంఖ్య
మయన్మార్ లో సంభవించిన భూంకప తీవ్రత కారణంగా దాదాపు 2700 మంది మరణించారు.;

మయన్మార్ లో సంభవించిన భూంకప తీవ్రత కారణంగా దాదాపు 2700 మంది మరణించారు. ఐదేళ్ల లోపు చిన్నారులు కూడా మృతుల్లో ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. దాదాపు ఐదు వేల మంది వరకూ భూకంప తీవ్రతకు గాయపడ్డారు. వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరో నాలుగు వందల మంది వరకూ ఆచూకీ తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు.
భవనాల కింద పడి...
అనేక భవనాలు, వంతెనలు కూలిపోవడంతో వాటి కింద నలిగి వీరంతా మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిధిలాలను, మట్టిదిబ్బలను తొలగించే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అవి పూర్తిగా తొలగిస్తే తప్ప మరికొందరి మృతదేహాల లభ్యమయ్యే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇంత భారీ గా ఆస్తి,ప్రాణ నష్టం జరగడంతో అనేక దేశాలు మయన్మార్ కు అండగా నిలుస్తున్నాయి.