Donald Trump : ట్రంప్ పై మరోసారి కాల్పులకు యత్నం?
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై మరోసారి కాల్పులకు ప్రయత్నం జరిగాయి;

Donald Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై మరోసారి కాల్పులకు ప్రయత్నం జరిగాయి. అతి సమీపంలో ట్రంప్ కు కాల్పులు జరగడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అమెరికాలో వరస కాల్పులతో ఈ ఘటన మరోకొసారి కలకలం రేపింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆయన చెవి పై నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో ఆయన గాయపడిన విషయమూ విదితమే.
గోల్ఫ్ ఆడుతుండగా...
అయితే ఈసారి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లోని తన కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనపించగా, ట్రంప్ భద్రతా సిబ్బంది అతనిపై కాల్పులు జరిపారు ఆ తర్వాత ట్రంప్ ను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనలో ట్రంప్ కు ఏమీ గాయాలు కాలేదు. అతడు పారిపోయాడని, సంఘటన ప్రాంతంలో ఏకే 47 మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు భద్రత సిబ్బంది తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టినట్లు తెలిపారు.