Remal Cyclone : తుపాను హెచ్చరిక.. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు

రెమాల్ తుపాను తీరం తాకినట్లు వాతావరణ వాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది

Update: 2024-05-27 02:54 GMT

రెమాల్ తుపాను తీరం తాకినట్లు వాతావరణ వాఖ తెలిపింది. బంగ్లాదేశ్ లోని మంగ్లా పోరటు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అందుకు తగినట్లుగానే తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

విమాన సర్వీసుల రద్దు...
ఇప్పటికే అనేక ఒడిశా, పశ్చిమబెంగాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కో‌ల్‌కత్తా విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలన్నింటినీ తుపాను కారణంగా రద్దు చేశారు. తుపాను ప్రభావం ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.
తీర ప్రాంత ప్రజలు...
దీంతో పాటు తీర ప్రాంత ప్రజలను కూడా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. మత్స్యకారులు ఎవరూ నేటి వరకూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. తుపాను తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లు వదలి బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, చెట్లు, హోర్డింగ్ లు పడే అవకాశముందని కూడా తెలిపింది.


Tags:    

Similar News