వరల్డ్ ను వణికిస్తున్న వరదలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలను వరదలు వణికిస్తున్నాయి. ఏ దేశంలో చూసినా వరదల తాకిడికి ప్రజలు నిరాశ్రయులవుతున్నారు
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలను వరదలు వణికిస్తున్నాయి. ఏ దేశంలో చూసినా వరదల తాకిడికి ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. అమెరికాలోని కెంటకీలో వరదల దెబ్బకు 16 మంది మరణించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రత్యేక టీంలు రంగంలోకి దిగాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోవడంతో వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు.
ఇరాన్ లోనూ....
ఇక ఇరాన్ లోనూ వరద బీభత్సం సృష్టించింది. ఇరాన్ లో యాభై మందికి పైగా మరణించారు. ఇక యూఏఈలో ఏడుగురు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల సంభవించిన వరదలకు నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలింంచారు. వర్క్ ఫ్రం హోం చేయాలని ప్రభుత్వ, ప్రయివేటు సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది. ఇక మూగజీవాల సంగతి చెప్పనవసరం లేదు. వాటిని రక్షించేందుకు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి.
రికార్డు స్థాయిలో...
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇప్పటి వరకూ ఇంత స్థాయిలో వరదలు రాలేదు. మూడు దశాబ్దాల తర్వాత అత్యధికంగా వర్షపాతం నమోదయిందని చెబుతున్నారు. రికార్డు స్థాయిలో వర్షం కురియడంతో నగరం నీట మునిగింది. ఫుజైరా నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 234. 5 మిల్లీ మీగర్ల వర్షపాతం నమోదయిందని అంటున్నారు. వరదల కారణంగా మరణించిన వారంతా ఆసియా నుంచి వచ్చిన ప్రవాసులేనని నిర్ధారించారు.