శ్రీలంకలో ఉద్రిక్తత.. ప్రధాని ఇంటి ముట్టడి
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు
శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొలంబోలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయి రాజపక్స దేశం నుంచి పారిపోయేందుకు సహకరించారని కూడా ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. గొటబాయి దేశం నుంచి పరారయ్యారని తెలుసుకున్న ఆందోళనకారులు ఒక్కసారిగా విక్రమసింఘే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్దసంఖ్యలో ఆందోళనకారులు విక్రమసింఘే ఇంటిలోకి చేరుకున్నారు.
పశ్చిమ ప్రాంతాల్లో కర్ఫ్యూ....
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అనేక సార్లు టియర్ గ్యాస్ ఉపయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో శ్రీలంకలో ఎమర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంక పశ్చిమ రాష్ట్రాల్లో కర్ఫ్యూను విధించారు. ఒక్కసారిగా జనం రోడ్లపైకి రావడం, పోలీసు వాహనాలపై రాళ్లదాడి చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆర్మీ అధికారులు పదే పదే హెచ్చరించినా ఆందోళనకారులు కదలడం లేదు. దీంతో పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.