రష్యా - ఉక్రెయిన్ యుద్ధం : ప్రపంచంతో కంటతడి పెట్టిస్తోన్న వీడియో !

అక్కడి ప్రజల ఇంటర్నెట్ తో పాటు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు కూడా స‌రిగ్గా ప‌ని చేయ‌కుండాపోవ‌డంతో ఆందోళ‌న చెందుతున్నారు.

Update: 2022-02-25 06:29 GMT

రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్ లోకి పంపి, దాడులు చేస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తోన్న పరిస్థితి. తొలిరోజు యుద్ధంలో 137 మంది సైనికులు, పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. అన్ని నగరాలను రష్యా సేనలు చుట్టుముడుతున్నాయని చెప్పారు. అక్కడి ప్రజల ఇంటర్నెట్ తో పాటు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు కూడా స‌రిగ్గా ప‌ని చేయ‌కుండాపోవ‌డంతో ఆందోళ‌న చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సూప‌ర్ మార్కెట్ల‌కు ప్ర‌జ‌లు పోటెత్తి స‌రుకులు కొనుక్కుంటున్నారు. ఏటీఎం కార్డులు ప‌నిచేయ‌కుండా పోవ‌డంతో కొంద‌రికి ఆ అవ‌కాశం కూడా లేని దుస్థితి దాపరించింది.

తాము ఎలా ఉన్నా.. తమ పిల్లలనైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబాలకు దూరమవుతున్న వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. తానెలా ఉన్నా.. భార్య, కూతురిని సురక్షిత ప్రాంతానికి పంపుతూ.. ఓ వ్యక్తి పడిన వేదన వీడియో రూపంలో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి పడిన వేదన, బాధ ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. చిన్నారిని మ‌రో ప్రాంతానికి పంపుతోన్న స‌మ‌యంలో ఆమెను ఆ తండ్రి గుండెకు హత్తుకొని క‌న్నీరు పెట్టుకున్నారు. బస్సు ఎక్కించిన తండ్రి ఆమెను చూడ‌కుండా ఎలా ఉండ‌గ‌ల‌నోనంటూ బాధ‌ప‌డిన తీరు నెటిజ‌న్ల‌ను క‌దిలిస్తోంది. ఇలాంటి వీడియోలు అక్కడున్న యుద్ధ తీవ్రతకు అద్దం పడుతున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు.




Tags:    

Similar News