లవ్ స్టోరీ లో 10నిముషాలు లేపేసారట

కరోనా సెకండ్ వేవ్ రావడం, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో హడావిడిగా నాగ చైతన్య – శేఖర్ కమ్ముల ప్రెస్ మీట్ పెట్టి సినిమాని పోస్ట్ పోన్ చేసేసారు. [more]

Update: 2021-04-28 09:47 GMT

కరోనా సెకండ్ వేవ్ రావడం, థియేటర్స్ ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో హడావిడిగా నాగ చైతన్య – శేఖర్ కమ్ముల ప్రెస్ మీట్ పెట్టి సినిమాని పోస్ట్ పోన్ చేసేసారు. అలా పోస్ట్ చెయ్యడమే మంచిదైంది. ఇప్పుడు థియేటర్స్ కూడా మూతబడ్డాయి. సెన్సార్ అయ్యి.. రిలీజ్ కి నాలుగు రోజులు ముందు సినిమా ని పోస్ట్ పోన్ చేసారు. అప్పటికే లవ్ స్టోరీ ప్రమోషన్స్ కూడా చాలా వరకు పూర్తయ్యాయి. సాయి పల్లవి – నాగ చైతన్య – శేఖర్ కమ్ముల లు లవ్ స్టోరీ ని బాగా ప్రమోట్ చేసారు. అయితే అన్ని పూర్తయి.. పోస్ట్ పోన్ చేసిన సినిమాని శేఖర్ కమ్ముల ఇంకా చెక్కుతున్నాడట.
అంటే ఎడిటింగ్ పరంగా లవ్ స్టోరీ విషయంలో కొంత నిడివి తగ్గించినట్టుగా టాక్. దాదాపుగా ఓ పది నిమిషాల సినిమాని ట్రిమ్ చేసినట్టుగా తెలుస్తుంది. పోస్ట్ పోన్ అయిన తర్వాత సినిమాని మరోసారి చూసుకున్న శేఖర్ కమ్ములకి సినిమాలో అక్కడక్కడా కొన్ని సీన్స్ ని వద్దనిపించి.. వాటిని ట్రిమ్ చేసేసాడట. లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓ పది నిమిషాల సినిమాని ట్రిమ్ చెయ్యడం వలన సమస్య రాదని శేఖర్ కమ్ముల అలా చేశారట. ఇప్పుడు లవ్ స్టోరీ పర్ఫెక్ట్ గా ఉందట. సినిమా రిలీజ్ డేట్ ఇచ్చాక కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అందులోనూ ఎడిటింగ్ విషయంల్లోనూ, నిడివి విషయంలోనూ. ఇప్పుడు వాటిని సరిచేయడానికి శేఖర్ ఖమ్ములకి చక్కటి టైం దొరికింది.

Tags:    

Similar News