మెగా ఫేక్ పోస్టరట

ఎస్… మెగాస్టార్ చిరంజీవికి సరైన సినిమా పడుతుంది. కొరటాల డైరెక్షన్ లో చిరు సినిమా అంటే ఇప్పుటి నుంచే అంచనాలు పెట్టుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ కి చిరు [more]

Update: 2019-10-18 08:30 GMT

ఎస్… మెగాస్టార్ చిరంజీవికి సరైన సినిమా పడుతుంది. కొరటాల డైరెక్షన్ లో చిరు సినిమా అంటే ఇప్పుటి నుంచే అంచనాలు పెట్టుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ కి చిరు ఎలా ఉండాలో అలా కొరటాల చూపిస్తాడు అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మూవీలో చిరు డ్యూయల్ రోల్ చేస్తున్నారు అని టాక్ ఉంది. నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి ఆగస్టు లో సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్. ఇక ఈ మూవీ టైటిల్ ఏంటా అని ఆలోచిస్తున్న ఫ్యాన్స్ కి టైటిల్ కూడా వచ్చేసింది. అయితే అది అఫిషియల్ టైటిల్ కాదులెండి! ‘గోవింద ఆచార్య’ అనే టైటిల్ తో చిరంజీవి ఒక స్టిల్ తో పోస్టర్ కూడా బయటకు వచ్చింది.

త్రిష వచ్చేనా….

అచ్చం ఒరిజినల్ పోస్టర్ లా ఉండడంతో దాని మెగా ఫ్యాన్స్ షేరులు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఆ పోస్టర్ వైరల్ అయింది. అది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని క్లారిటీ లేక ఎవరికి వాళ్ళు ఒరిజినల్ అనుకుని షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్ అండ్ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఆ పోస్టర్ విషయంపై రెస్పాండ్ అయ్యారు. “ఇప్పటి వరకు చిరు 152 చిత్రం టైటిల్ ను ఖరారు చేయలేదని.. మేము సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఇతర వివరాలను ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటిస్తామని” ట్వీట్ చేయడంతో అది ఫేక్ పోస్టర్ అని తెలుసుకున్నారు. ఇక చిరు కి హీరోయిన్ గా నయనతార ని తీసుకుందాం అనుకున్నారు ఇప్పుడు త్రిషను అకుంటున్నారు. మరి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

 

Tags:    

Similar News