మెగా భజనలపై 30 ఇయర్స్ పృథ్వీ కీలక వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కొందరు వేదికలపై నుండి తెగ పొగిడేసిన
మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కొందరు వేదికలపై నుండి తెగ పొగిడేసిన సంగతి తెలిసిందే..! ఈ భజన బ్యాచ్ కారణంగా చిరంజీవి చెత్త సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారని.. ఈ భజన బృందాలను పక్కన పెట్టాలంటూ పలువురు కోరుతూ ఉన్నారు. భజనకారులను దూరం పెడితేనే చిరంజీవికి మంచి జరుగుతుందని రామ్‌గోపాల్‌వర్మతో పాటు పలువురు విమర్శలు గుప్పించారు.
తాజాగా కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. మెగా ఫ్యామిలీ భజనలను ఎంకరేజ్ చేయదని.. సిన్సియర్‌గా కష్టపడి పనిచేసే వాళ్లను చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేస్తారని అన్నాడు. భజనకారులను ఏ కోశాన కూడా పట్టించుకోరని పృథ్వీ తెలిపాడు. ప్రస్తుతం ఒకటి, రెండు హిట్లతోనే హీరోల మనస్తత్వాల్లో మార్పులు వస్తున్నాయని.. 150 సినిమాలకు పైగా చేసిన చిరంజీవి వ్యక్తిత్వంలో కొంచెం కూడా మార్పు రాలేదని పృథ్వీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న హీరోలు బిల్డప్‌లు తగ్గించుకొని సినిమాలు చేస్తే మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అందరూ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మాదిరిగా ఫీలైతే కుదరదని, వారి స్థాయికి చేరుకోవడానికి ఎంతో హార్డ్ వర్క్ చేయాలన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ మూవీ డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. వేదాళం సినిమా ఆధారంగా డైరెక్టర్ మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమాను తెరకెక్కించాడు. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడమే ఈ సినిమా పరాజయానికి కారణమని విమర్శలు వచ్చాయి. ఈ సినిమా భారీ నష్టాలను తెచ్చిపెట్టిందని అంటున్నారు.