థియేటర్ లో విక్రాంత్ రోణ.. బయటేమో కొడవళ్ళతో దాడులు చేసుకున్న గ్యాంగ్ లు

థియేటర్ బయట కొడవళ్ళతో దాడులు చేసుకున్న గ్యాంగ్ లు

Update: 2022-08-03 06:39 GMT

కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన విక్రాంత్ రోణ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. అయితే కర్ణాటక రాష్ట్రం చిక్ మగలూరులో ఓ అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. విక్రాంత్ రోణ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. మిలన్ థియేటర్‌లో విక్రాంత్ రోనా సినిమా ప్రదర్శింపబడుతోంది. ఈ సమయంలో థియేటర్ వెలుపల యువకుల సమూహం ఉంది. సినిమా చూసేందుకు వచ్చిన భరత్‌ బృందంపై ఓ వర్గం దాడి చేసింది. థియేటర్ బయట గొడవలో భరత్ ఒక్కసారిగా నేలకూలాడు. అయినా వదలకుండా భరత్ పై దాడికి పాల్పడ్డారు. థియేటర్ బయట ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. కొందరు గొడవ పడుతున్న వారిని విడిపించే ప్రయత్నం చేశారు. దాడిలో భరత్‌కు తీవ్రగాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం హాసన్‌కు తరలించారు. భరత్‌ హసన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

యువకులు ఏకంగా కొడవళ్లతో దాడులు చేసుకోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీసులు నాలుగు రోజుల్లో 6 మంది నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు నిందితులను 11 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.


Tags:    

Similar News