అల్లు అర్జున్ – కొరటాల హీరోయిన్?
అల్లు అర్జున్ – కొరటాల కాంబో షురూ అయ్యింది. వారి కాంబో మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు అర్జున్ [more]
అల్లు అర్జున్ – కొరటాల కాంబో షురూ అయ్యింది. వారి కాంబో మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు అర్జున్ [more]
అల్లు అర్జున్ – కొరటాల కాంబో షురూ అయ్యింది. వారి కాంబో మూవీపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు అర్జున్ కొరటాల మూవీని ప్రకటించాడు. కొరటాల కూడా మెగా కాంపౌండ్ లోనే మరో మూవీని సైలెంట్ గా అనౌన్స్ చేసాడు. ఆచార్య సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఓ మంచి కథని ప్రిపేర్ చేసి బన్నీకి వినిపించి ఓకె చేయించుకున్న కొరటాల శివ ఆఫీసియల్ గా ప్రకటన కూడా ఇప్పించేసుకున్నాడు.ఆచర్య అవడమే తరువాయి.. బన్నీ మూవీ స్క్రిప్ట్ మీద కూర్చుంటాడట కొరటాల. ఇక బన్నీ – కొరటాల శివ కాంబో మూవీ పోస్టర్ చూస్తుంటే మళ్ళీ కొరటాల సామాజిక అంశాన్ని నెత్తినెట్టుకున్నాడనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళ కాంబో అలా సెట్ అయ్యిందో లేదో ఇలా హీరోయిన్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం లోకొచ్చాయి.
కొరటాల శివ తన మొదటి సినిమా మిర్చి లో అనుష్క ని రిచా గంగోపాద్యాని తీసుకున్నాడు. ప్రభాస్ కి పర్ఫెక్ట్ జోడి అనుష్క అనేలా ఉంది ఆ సినిమాలో. తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు తీసిన కొరటాల మహేష్ కోసం శృతి హాసన్ ని తీసుకున్నాడు. ఇక మూడో సినిమా జనత గ్యారేజ్ లో నిత్య మీనన్, సమంత లని తీసుకుని ట్రెడిషనల్, గ్లామర్ కి పెద్ద పీట వేసిన కొరటాల శివ మహేష్ తో భరత్ అనే నేను వచ్చేసరికి బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకొచ్చాడు. కియారా అద్వానీ అందాలు భారత అనే నేనుకి మెయిన్ ఎస్సెట్ అనేలా ఉంది. మరి ఆచార్య కోసం చిరుకి జోడిగా త్రిషని పట్టుకొచ్చిన కొరటాలకి త్రిష షాకిచ్చింది. తర్వాత కొరటాల శివ చిరు కోసం కాజల్ ని తీసుకొచ్చాడు. మరి కొరటాల శివ ఇప్పుడు అల్లు అర్జున్ కోసం బాలీవడో భామని తీసుకుంటాడో.. లేదంటే సౌత్ హీరోయిన్ తోనే సరిపెడతాడో చూడాలి. కత్తిలాంటి హీరోయిన్ ని అయితే అల్లు అర్జున్ కోసం కొరటాల శివ తీసుకురావడం పక్కా.. కానీ ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరనేది మెయిన్ సస్పెన్స్.