అభిజిత్ మోసపోయాడా? మోసం చేసారా?

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ విషయంలో పర్ఫెక్ట్ గా పెరఫార్మెన్సు ఇవ్వలేని అభిజిత్.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఒకటికి 100 సార్లు చదివి [more]

Update: 2020-12-13 16:30 GMT

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ విషయంలో పర్ఫెక్ట్ గా పెరఫార్మెన్సు ఇవ్వలేని అభిజిత్.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఒకటికి 100 సార్లు చదివి తెలివిగా అలోచించి గేమ్ ఆడతాడని బిగ్ బాస్ ని ఫాలో అవుతున్న అందరికి తెలిసిన విషయమే. అట మీద గట్టిగా ఫోకస్ పెట్టే అభిజిత్ ఫిజికల్ టాస్క్ విషయంలో కామ్ గా ఉండిపోతాడు. అభిజిత్ కి ఏదో ప్రాబ్లెమ్ ఉండబట్టే అభిజిత్ ఫిజికల్ టాస్క్ ఆడడని చాలామంది అంటున్నారు. అయితే టాస్క్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండే అభిజిత్ ని బిగ్ బాస్ చివరి టాస్క్ ల్లో బురిడీ కొట్టించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

నిన్న రాత్రి బిగ్ బాస్ స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఆగకూడదు, కూర్చోకూడదు, అంటూ సరిపోని సైజు షూస్ తో కంటెస్టెంట్స్ కి స్టేజ్ డాన్స్ టాస్క్ ఇవ్వగా.. అందులో అరియానని ముందు దిగమంటే నేను సెకండ్ దిగుతా అంటూ అందరితో వాదిస్తుంది అరియనా. హౌస్ మేట్స్ అందరూ అరియానాతో మాట్లాడుతుంటే.. ఆభిజీత్ కూడా అరియానని దిగమంటూ వాదించాక.. సైలెంట్ గా స్టేజ్ మీద కూర్చుండి పోయాడు. దానితో హారిక – మోనాల్ లు అభి స్టాండ్ అప్.. కూర్చో కూడదు. కూర్చుంటే అవుట్.. లే అనగానే లేచిన అభిజిత్ అయ్యో నాకు తెలియదు అంటే.. నిజమే తెలియదు అని హారిక చెప్పగా, బిగ్ బాస్ తాను ఇచ్చిన టాస్క్ లో అన్ని చెప్పారంటూ అఖిల్ బుక్ తెచ్చి చదివాడు. మరి ఒక్కో టాస్క్ వివరాలను పదే పదే చదివే అభిజిత్ ఆ డాన్స్ టాస్క్ విషయంలో చదవకపోడంతో ఫస్ట్ స్టేజ్ మీదనుండి దిగాల్సి వచ్చింది.

Tags:    

Similar News