అభిరామ్ ఓపెన్ అయ్యాడు

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్న విషయం తెలిసిందే. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దగ్గుబాటి అభిరామ్, [more]

Update: 2021-05-14 11:15 GMT

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్న విషయం తెలిసిందే. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దగ్గుబాటి అభిరామ్, నటి శ్రీ రెడ్డి విషయంగా బాగా పాపులర్ అయ్యాడు. శ్రీ రెడ్డితో ఎఫ్ఫైర్ నడిపాడనే సీన్ క్రియేట్ చేసింది శ్రీ రెడ్డి. తనతో అభిరామ్ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అయితే తాజాగా అభిరామ్ తాను చేసిన తప్పులను ఒప్పుకుంటున్నాడు.
అంటే తన డెబ్యూ విషయంగా మాట్లాడిన అభిరామ్ తాను గతంలో తప్పులు చేసానని, అందరూ తప్పులు చేస్తారని, చేసిన తప్పుల నుండి చాలా విషయాలనే నేర్చుకున్నా అని, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో అనేది నేర్చుకున్నానని, కష్ట కాలంలో నా ఫ్యామిలీ నాకు అండగా నిలబడింది అని చెబుతున్నాడు అభిరామ్. కాకపోతే కెరీర్ మొదలు పెట్టకముందే ఇలాంటివి జరిగిపోయాయని, ఇంకెప్పుడు తప్పు చెయ్యను అంటున్నాడు.
ప్రస్తుతం అభిరామ్ తేజ దర్శకత్వంలో డెబ్యూ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. తేజ గారితో సినిమా అనగానే భయం వేసింది అని, నేనే రాజు నేనే మంత్రి టైం లో అయన డైరెక్షన్ చూసా అని, ఆయనతోనే నా మొదటి సినిమా లాంచ్ అవ్వాలనుకున్నా అని, అందుకే తేజ గారు నా కోసం కథ రస్తా అని మాటిచ్చినట్లుగానే కథ రాసి నాన్నతో ఓకె చేయించి నన్ను డెబ్యూ హీరోగా తేజ గారు లాంచ్ చెయ్యబోతున్నారంటూ చెప్పుకొచ్చాడు అభిరాం.

Tags:    

Similar News