ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన కమల్..విశ్రాంతి అవసరమన్న వైద్యులు

భయపడాల్సిందేమీ లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో .. హమ్మయ్య అనుకున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులు..;

Update: 2022-11-25 12:53 GMT
ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన కమల్..విశ్రాంతి అవసరమన్న వైద్యులు
  • whatsapp icon

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇటీవల జ్వరం, దగ్గుతో, జలుబు లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితమ్ హైదరాబాద్ వచ్చిన కమల్.. దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కలిశారు. అదే రోజు చెన్నై వెళ్లిపోయిన ఆయన సాయంత్రానికి అనారోగ్య లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ ఆసుపత్రిలో చేరారు. దాంతో కమల్ కి ఏమైందోనని అభిమానులు ఆందోళన చెందారు.

భయపడాల్సిందేమీ లేదని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో .. హమ్మయ్య అనుకున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులు ఆయన ఆరోగ్యంపై బులెటిన్ల ద్వారా సమాచారం అందించారు. ఈ మధ్యాహ్నం కమల్ ను డిశ్చార్జి చేసిన వైద్యులు, కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ సీజన్ 6కి హోస్ట్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తున్నారు.


Tags:    

Similar News