పూరి సిద్ధం చేసిన కథ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించిన పూరీ జగన్నాథ్ ఈ మధ్య కాలంలో వరస ప్లాపులు చూస్తున్నాడు;

Update: 2025-03-28 12:06 GMT
puri jagannath, vijay sethupathi, new movie, tollywood
  • whatsapp icon

పూరి జగన్నాధ్ అంటే అందరికీ ఇష్టమైన దర్శకుడు. ఎందుకంటే ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించిన పూరీ జగన్నాథ్ ఈ మధ్య కాలంలో వరస ప్లాపులు చూస్తున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న మూవీ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పోకిరీ, ఇడియట్.. ఇస్మార్ట్ శంకర్ వరకూ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్స్ అందుకున్న దర్శకుడాయన. ఆయన కథనంలోనూ, దర్శకత్వంలోనూ ప్రత్యేకత ఉంటుంది. రాజమౌళి తండ్రి సయితం పూరి జగన్నాధ్ ఫొటోను తన ఫోన్ లో డీపీగా పెట్టుకున్నారంటే అంతకు మించి వేరే చెప్పాల్సిన పనిలేదు. దీంతో పాటు అత్యంత వేగంగా చిత్రీకరణ జరపడంలోనూ ఆయనకు మించిన వారు లేరని స్వయంగా రాజమౌళి చెప్పారంటే ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.

కొన్ని రోజుల నుంచి హిట్స్ లేక...
అలాంటి దర్శకుడు పూరీ జగన్నాథ్ నుంచి గత కొన్ని రోజుల నుంచి హిట్స్ లేవు. విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో ఆయన కొంత ఇబ్బందిపడ్డాడు. అయితే తిరిగి తేరుకుని ఇప్పుడు మరోచిత్రం దర్శకత్వానికి సిద్ధమయినట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ పూర్తయిందంటున్నారు. ఇందులో విజయ్ సేతుపతి నటిస్తారని తెలిసింది. కంబ్యాక్ ఇచ్చేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. తమిళ హీరో విజయ్ సేతుపతితో తీస్తున్న ఈ మూవీకి టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ కి కథ చెప్పగా అందుకు అంగీకరించారని, ఇక షూటింగ్ మొదలు కావడమే తరువాయి అని పూరీ జగన్నాధ్ టీం చెబుతుంది.
టైటిల్ ఇదే...
ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను పెట్టినట్లు తెలిసింది. ఈ టైటిల్ తోనే పూరీ జగన్నాథ్ ప్రేక్షకులకు ముందు రానున్నారని టాక్. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే నెల లేదా మే నెల నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిసింది. యాక్షన్ తో పాటు క్రైమ్, కామిడీని మిళితం చేసి పూరీ జగన్నాథ్ కథను సిద్ధం చేశారని చెబుతున్నారు. విజయ్ సేతుపతికి తమిళంలో ఎంత క్రేజ్ ఉందో, తెలుగులోనూ అంతే క్రేజ్ ఉండటంతో ఆయనను ఎంచుకున్నట్లు తెలిసింది. బ్యాంకాంగ్ కు వెళ్లిన పూరీ జగన్నాథ్ కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకుని వచ్చి విజయ్ సేతుపతికి వినిపించగానే వెంటనే ఓకే చెప్పేయడంతో త్వరలోనే మరో బ్లాక్ బాస్టర్ హిట్ పూరీ అందుకుంటారన్నది పరిశ్రమ వర్గాల టాక్.


Tags:    

Similar News