నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రంగా మిగిలిపోతుందా? వీరి లెక్కలివే

Update: 2025-03-27 05:56 GMT
nithiin, hero , robin hood, venky kudumala
  • whatsapp icon

హీరో నితిన్ కు ఈ మధ్య కాలంలో ఎక్కువ విజయాలు లేవు. విక్టరీ కోసం చాలా కాలంగా నితిన్ ఎదురు చూస్తున్నాడు. అయితే రాబిన్ హుడ్ మూవీ నితిన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కామెడీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది. కామెడీ సినిమాలే ఇటీవల కాలంలో హిట్ అవుతుండటంతో హాస్యమే ప్రధానంగా అన్ని చిత్రాలను రూపొందిస్తున్నారు. యాక్షన్, ఫైట్స్ కంటే కామెడీకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు కుటుంబ సమేతంగా థియేటర్ కు వచ్చి చూస్తుండటంతో కలెక్షన్లు కూడా వాటికే ఎక్కువ వస్తున్నాయి.

హాస్యం పాళ్లు ఎక్కువగా...
అందుకే నితిన్ నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న రాబిన్ హుడ్ లో కూడా హాస్యం పాళ్లు ఎక్కువగా ఉన్నాయని హీరో నితిన్ చెప్పారు. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీస్ లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో తాను విభిన్న పాత్రలో కనిపించినట్లు హీరో నితిన్ తెలిపారు. ఈ చిత్రం తనకు ఒక ప్రత్యేకమన్న నితిన్ ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఖాయమని తెలిపారు. కేవలం కామెడీతో పాటు భావోద్వేగాలు కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని, ప్రేక్షకులకు కావాల్సిన ఫ్యామిలీ ప్యాక్ అందనుందని తెలిపారు.
డేవిడ్ వార్నర్ ప్రత్యేక ఆకర్షణగా...
రాబిన్ హుడ్ చిత్రంలో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని తెలిపారు. అలాగే హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా నటిస్తుండటంతో హాస్యం మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మంచి అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు తెలిపారు. రంగస్థలం మేజిక్ ను ఈ మూవీ రిపీట్ చేస్తుందని అన్నారు. నితిన్ కూడా మాట్లాడుతూ పాత ధరలకే టిక్కెట్లను విక్రయిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రం తనకు మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం తనకు ఉందని, మూవీని చూసిన తర్వాత తమ నమ్మకం మరింత మెరుగుపడిందని తెలపడంతో నితిన్ ఫ్యాస్స్ కు గుడ్ న్యూస్ అందినట్లే.















Tags:    

Similar News