మంచి మాట చెప్పిన సునీల్..!

కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తరువాత హీరోగా కూడా చేసి మళ్లీ తిరిగి కమెడియన్ గా వచ్చిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో [more]

Update: 2019-05-24 08:57 GMT

కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తరువాత హీరోగా కూడా చేసి మళ్లీ తిరిగి కమెడియన్ గా వచ్చిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని మంచి మాటలు చెప్పారు. సునీల్ మాట్లాడుతూ…” అందరి హీరోల అభిమానులు తన సినిమాలు చూస్తారు. నన్ను ఇష్ట పడతారు. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం అని చెప్పాలి. ఇలా ఎవరికీ ఉండరు. నాకంటూ ప్రత్యేకంగా అభిమాన సంఘాలు లేవు. అయితే గతంలో కొంతమంది వచ్చి మీకు అభిమాన సంఘాలు పెడతామని అన్నారు.’’ అని తెలిపారు.

సమయం వృధా చేసుకోకండి..

‘‘నేను అటువంటివి ఏమీ చేయకండి… సమయం చాలా విలువైంది. దాని వేస్ట్ చేయకండి. ఆ సమయం మీ ఫామిలీ కోసం కేటాయించండి. జీవితంలో ఏదైనా సాధించదలచుకుంటే దానిపై దృష్టి పెట్టండి. మీరు మీ పని చేసుకుంటూనే నా సినిమాలు కూడా చూస్తా ఉండండి. నా మూవీస్ నచ్చితే పది మందికి చెప్పండి. అంతేగాని ఇలా నా కోసం మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు.. జీవితంలో తిరిగిరానిది సమయమే అని చెబుతుంటాను” అని ఆయన అన్నారు. తన వద్దకు అభిమానులు ఎప్పుడు కలవడానికి వచ్చినా నేను ఇదే చెప్తాను’’ అని ఆయన అన్నారు.

Tags:    

Similar News