వీళ్ళు సినిమాల నుండి కనుమరుగవుతారా?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి.. టాలీవుడ్ ప్రముఖులెవరు జగన్ ని కలిసిన పాపాన పోలేదు. గతంలో చంద్రబాబు చుట్టు తిరిగినోళ్ళు.. ఇప్పుడు సీఎం జగన్ ని పట్టించుకోవట్లేదు [more]

Update: 2019-09-03 07:37 GMT

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి.. టాలీవుడ్ ప్రముఖులెవరు జగన్ ని కలిసిన పాపాన పోలేదు. గతంలో చంద్రబాబు చుట్టు తిరిగినోళ్ళు.. ఇప్పుడు సీఎం జగన్ ని పట్టించుకోవట్లేదు అని నటుడు పృథ్వి ఎప్పటినుండో అంటే, వైసిపిలో చేరినప్పటినుండి మొత్తుకుంటున్నాడు. ఇక అలీ, పోసానీ కూడా వైసిపి లో చేరి వైసిపి భజన చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొదట్లో టిడిపి అన్న అలీ.. చివరికి ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం పెంచుకుని వైసిపిలో చేరడం అలీ కి సినిమాల పరంగా పెద్ద దెబ్బ. ఇక పోసాని లాంటి సీనియర్ నటుడు కూడా వైసిపి లో చేరి జగన్ భజన చెయ్యడంతో.. ఇప్పుడు అలీ, పోసాని, పృథ్విలకు సినిమా అవకాశాలు కరువయ్యాయనే న్యూస్ బాగా ప్రచారంలోకొచ్చింది.

ఎప్పుడూ సినిమాల్తో బిజీగా గడిపే అలీ.. పవన్ తో శత్రుత్వం తర్వాత కాస్త ఖాళీ అయ్యాడని… పృథ్వి సినీ పెద్దల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసి… చాలా అవకాశాలు కోల్పోయాడని, పోసాని అనారోగ్యం కారణాలతోను, రాజంకీయాల్తోనూ సినిమాలకు దూరమవుతున్నాడని అంటున్నారు. టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ అవకాశాలు అలీ కి, పోసానికి, పృథ్వికి ఇక రావనే ప్రచారం ఊపందుకుంది. ఎవ్వరికి శత్రువు కానీ అలీ వైసిపిలో చేరి టాలీవుడ్ పెద్దలతో శత్రుత్వం పెట్టుకున్నాడని అంటున్నారు. ఇప్పటికే పృథ్వి తన వ్యాఖ్యల కారణంతో కెరీర్ ని ప్రమాదంలో పడేసుకున్నాడని అంటున్నారు. మరి రాజకీయాల్లో చేరి కెరీర్ ని కోల్పోయిన నటుల లిస్ట్ లో ఇప్పుడు అలీ, పోసాని, పృథ్వి కూడా చేరేట్టుగా కనబడుతున్నారు.

Tags:    

Similar News