టీటీడీ అధికారులపై నటి ఫైర్.. అసలేం జరిగింది ?
అలా చేయడం కుదరదన్న టీటీడీ సిబ్బంది.. శ్రీవాణి ట్రస్ట్ వీఐపీ బ్రేక్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. కానీ తనకు..
తిరుమలలో టీటీడీ అధికారుల తీరుపై యూపీ నటి అర్చన గౌతమ్ ఫైరయ్యారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన తనపై టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. తాను తెచ్చిన సిఫార్సు లెటర్‌కు.. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన కోరారు. అయితే.. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో.. తనకు వీఐపీ బ్రేక్ దర్శనమే కావాలని అర్చన పట్టుబట్టింది.
అలా చేయడం కుదరదన్న టీటీడీ సిబ్బంది.. శ్రీవాణి ట్రస్ట్ వీఐపీ బ్రేక్ టికెట్లు తీసుకోవాలని సూచించారు. కానీ తనకు సిఫార్సు లెటర్ పైనే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని అర్చన మొండికేసింది. టీటీడీ జేఈఓ కార్యాలయంలో నానా హంగామా చేసింది. టీటీడీ సిబ్బంది తనపై దుసురుగా ప్రవర్తించారని.. దర్శనం టికెట్ కోసం పది వేలు డిమాండ్ చేశారంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.