జబర్దస్త్ టూ బిగ్ బాస్.. తర్వాత?

అప్పుడు జబర్దస్త్ అవినాష్.. ఇప్పుడు బిగ్ బాస్ అవినాష్. జబర్దస్త్ లో మంచి రెమ్యునరేషన్ వదులుకుని బిగ్ బాస్ ఇచ్చేదానికి ఆశపడి.. వచ్చినప్పటినుండి బిగ్ బాస్ లో [more]

Update: 2020-11-27 05:18 GMT

అప్పుడు జబర్దస్త్ అవినాష్.. ఇప్పుడు బిగ్ బాస్ అవినాష్. జబర్దస్త్ లో మంచి రెమ్యునరేషన్ వదులుకుని బిగ్ బాస్ ఇచ్చేదానికి ఆశపడి.. వచ్చినప్పటినుండి బిగ్ బాస్ లో టైటిల్ గెలవాలనే కోరిక, ఆశ. సింపతీ క్రియేట్ చేసుకోవడం కోసం జబర్డ్స్ ని తక్కువ చేసి మట్లాడడం ఇది ముక్కు అవినాష్ బిగ్ బాస్ ప్రయాణం. ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న అవినాష్ బాధపడి.. బిగ్ బాస్ గేమ్ తో ఎలాగో బయటపడ్డాడు. ఇక జబర్దస్త్ లోకి అవినాష్ నో ఎంట్రీ అనే విషయం అవినాశే చెప్పాడు. బిగ్ బాస్ లో నాకిక ఆ షోకి ఎంట్రీ లేదంటూ ఏడ్చాడు.  

మరి బిగ్ బాస్ టైటిల్ గెలిచినా, ఈ మూడు వారాల్లో ఎలిమినేట్ అయినా.. అవినాష్ పరిస్థితి ఏమిటి? బిగ్ బాస్ తర్వాత నెక్స్ట్ ఏంటి అవినాష్ అంటున్నారు. మరి జబర్దస్త్ లోకి మళ్ళీ రావొచ్చని అవినాష్ తమ్ముళ్లు అంటుంటే.. అవినాష్ కుదరదంటున్నాడు. మరోపక్క అవినాష్ కి అదిరింది ప్రోగ్రాం నుండి ఆహ్వానం అందింది అని..జబర్దస్త్ వదిలి రమ్మని అడిగారని.. మధ్యలో వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ కాదనలేక అవినాష్ బిగ్ బాస్ కి వచ్చినప్పటికీ నెక్స్ట్ అదిరింది ఎంట్రీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే ఉన్నాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News