అదిరింది మళ్ళీ మొదలు కాబోతుంది!

జీ తెలుగులో నాగబాబు కర్త కర్మ క్రియ గా మొదలైన అదిరింది షో గత కొన్ని వారాలుగా ప్రసారం కావడం లేదు. కామెడీ షో గా కలరింగ్ [more]

;

Update: 2021-02-07 05:12 GMT

జీ తెలుగులో నాగబాబు కర్త కర్మ క్రియ గా మొదలైన అదిరింది షో గత కొన్ని వారాలుగా ప్రసారం కావడం లేదు. కామెడీ షో గా కలరింగ్ ఇచ్చినా, బొమ్మ అదిరింది అంటూ పబ్లసిటీ చేసినా అదిరింది ప్రోగ్రాం రేటింగ్ లో వెనుకబడిపోయింది. జబర్దస్త్ ని తొక్కేస్తాం, జబర్దస్త్ ని పడేస్తాం అంటూ నాగబాబు చేసిన అదిరింది ప్రయత్నం బెడిసికొట్టింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఇక అదిరింది అదరలేక చేతులెత్తేసింది. మళ్ళీ ఈ ప్రోగ్రాం ఉండదు, పాపం కామెడిన్స్ అందరూ నాగబాబుని నమ్ముకుని రోడ్డున పడ్డారు. నాగబాబు అదిరింది షో లేక యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటున్నాడు అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రసారం జరుగుతుంది.

అయితే రీసెంట్ గా అదిరింది షో ద్వారా కం బ్యాక్ అయిన వేణు అదిరింది ప్రోగ్రాం ఆగలేదంటున్నాడు. చమ్మక్ చంద్ర తో కలిసి ఓ ఇంటర్వ్యూ లో అదిరింది ప్రోగ్రాం ఆగలేదు.. ఇప్పటికి ఓ సెషన్ పూర్తి అయ్యింది, మరో కొత్త అదిరింది సీజన్ మొదలు కాబోతుంది అంటూ అదిరింది ప్రోగ్రాం ఆగింది అంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు వేణు. అదిరింది షో టెలికాస్ట్ అయ్యే ఛానల్ జాతీయ ఛానల్. అందుకే కొన్ని షోస్ ని సీజన్స్ వారీగా నిర్వహిస్తారు. అందులో భాగంగానే అదిరింది ఓ సీజన్ పూర్తయ్యింది. త్వరలోనే మరో సీజన్ మొదలు కాబోతుంది అంటూ అదిరింది షో ఆగలేదు అని క్లారిటీ ఇచ్చాడు వేణు. అయితే ఆ షో మళ్ళీ ఎప్పుడు అదరబోతుందో మాత్రం చెప్పలేదు.

Tags:    

Similar News