పవన్ సినిమా షూట్ లో గాయాలపాలైన నటుడు

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏకే [more]

Update: 2021-04-01 13:20 GMT

పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ లో జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్ షూట్ లో ఉండడంతో.. పవన్ లేని సీన్స్ ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ లో ఓ ప్రముఖ నటుడు షూటింగ్ స్పాట్ లో గాయపడడం హాట్ టాపిక్ గా మరింది. గతంలో పవన్ కళ్యాణ్ తో అజ్ఞ్యాతవాసి సినిమాలో నటించిన ఆదిత్య మీనన్ హరిహర వీరమల్లులో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అయితే వీరమల్లు షూటింగ్ లో గుర్రపు స్వారీ చేస్తున్న ఓ కీలక సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండగా.. ఆదిత్య మీనన్ కి  తీవ్ర గాయాలు అయ్యినట్టుగా సమాచారం. గుర్రం మీది నుండి కింద పడిన ఆదిత్య మీనన్ కి దెబ్బలు ఎక్కువగా తగలడంతో వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్ కి తరలించినట్లుగా.. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన డాక్టర్స్ ఆయన్ని వెంటనే చెన్నై లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కి తరలించినట్లుగా తెలుస్తుంది. ఆదిత్య మీనన్ కి ఎక్కువ గాయాలవడంతో డాక్టర్స్ ఆయన్ని అబ్జర్వేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆదిత్య ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News