బాలీవుడ్ బాక్సాఫీస్ మీదకు దూకబోతున్న మరో తెలుగు సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే

ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 3న మేజర్‌ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్,

Update: 2022-04-27 09:21 GMT

హైదరాబాద్ : బాలీవుడ్ బాక్సాఫీసును దక్షిణాది సినిమాలు షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..! కంటెంట్ ఉండడంతో బాలీవుడ్ జనాలు కూడా దక్షిణాది సినిమాల కోసం తెగ ఎదురుచూస్తూ ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలు ఇప్పటికే కనకవర్షం కురిపిస్తున్నాయి. బాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ రికార్డును కొల్లగొడుతూ ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ సినిమాల ప్రభంజనం ఇంకా తగ్గకముందే త్వరలో మరో పాన్ ఇండియా సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఆ సినిమానే 'మేజర్'.

అడివి శేష్, సయీ మంజ్రేకర్ నటించిన 'మేజర్' సినిమాకు కొత్త విడుదల తేదీని నిర్ధారించారు. ఇప్పటికే సినిమా రిలీజ్ చాలా సార్లు వాయిదా పడిన తర్వాత, సినిమా జూన్ 3, 2022న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. నిజజీవిత సంఘటనల నుండి ప్రేరణ పొందిన సినిమా ఇది. నవంబర్ 26, 2008న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ఉగ్రవాదులు దాడి జరిపినప్పుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా స్పందించారు అన్నదే సినిమా కథ. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 3న మేజర్‌ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. శశికిరణ్‌ తిక్క సినిమాకు దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన సినిమాను పలు భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. మేజర్‌ని మొదట మే 27న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, కొన్ని కారణాల వల్ల విడుదల తేదీలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది.


Tags:    

Similar News