#RRR పై స్పందించిన అజయ్ దేవగన్

గత కొన్ని రోజులు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ #RRR లో విలన్ పాత్ర చేస్తున్నాడని, అలానే శంకర్ డైరెక్ట్ చేస్తున్న కమల్ హాసన్ హీరో [more]

Update: 2019-02-17 10:46 GMT

గత కొన్ని రోజులు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ #RRR లో విలన్ పాత్ర చేస్తున్నాడని, అలానే శంకర్ డైరెక్ట్ చేస్తున్న కమల్ హాసన్ హీరో గా వస్తున్నా ‘భారతీయుడు-2’ లో కూడా అజయ్ విలన్ పాత్ర లో కనిపిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

అయితే లేటెస్ట్ గా ఈ వార్తల పై రియాక్ట్ అయ్యాడు హీరో అజయ్ దేవగన్. దీనిపై తన వివరణ ఇచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు-2’లో విలన్ పాత్రను పోషించాలని శంకర్ తనను సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నాడు. అయితే తాను ప్రస్తుతం ‘తానాజీ’ అనే సినిమాతో బిజీగా ఉండడంతో ‘భారతీయుడు-2’ ను అంగీకరించలేక పోయానని అన్నాడు.

ఇక ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో లో వస్తున్నా #RRR లో తాను నటిస్తున్నానన్న వార్తలపై స్పందిస్తూ…ఇంతవరకు డైరెక్టర్ రాజమౌళి తనను సంప్రదించలేదని స్పష్టం చేశాడు. తాను ఈమూవీ లో నటిస్తున్నా అని వస్తున్నా వార్తల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.

Tags:    

Similar News