హీరో అవకుండానే స్టార్ అయ్యాడే!!

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ మీద పవన్ ఫాన్స్ పిచ్చ అంచనాలు పెట్టేసుకున్నారు.. పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో భీభత్సమైన క్రేజ్. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ [more]

Update: 2020-04-09 05:40 GMT

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ మీద పవన్ ఫాన్స్ పిచ్చ అంచనాలు పెట్టేసుకున్నారు.. పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో భీభత్సమైన క్రేజ్. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నెగ్గలేకపోయినా.. సినిమాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికి కింగ్. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాపై పిచ్చ క్రేజ్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ – రేణు కొడుకు అకీరా నందన్ సినిమా ల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో తెలియదు కానీ.. అకీరా పై పవన్ ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

 

 

 

తాజాగా అకీరా నందన్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 న అకీరా కి విష్ చేసిన వారు బోలెడంత మంది. స్టార్ హీరో అల్లు అర్జున్, అకీరా పుట్టిన రోజు ఒకే రోజు కావడం మెగా ఫాన్స్ కి మెగా ఫ్యామిలీకి స్పెషల్ అయితే.. అల్లు అర్జున్ కి ఎంతగా ఫాలోయింగ్ ఉందొ.. అకీరా కి దానికి కొద్దిగా ఫాలోయింగ్ తగ్గింది కానీ.. అకీరా క్రేజ్ మాత్రం మాములుగా లేదు. అకీరా నందన్ ఫ్యాన్ మెడ్ పోస్టర్స్, బర్త్ డే కామన్ డిపి, అకీరా కి బర్త్ డే విషెస్ అబ్బో సోషల్ మీడియా అంతా మెగా హీరోల హడావిడే. నిన్న మొత్తంలో అల్లు అర్జున్ తర్వాత ట్రేండింగ్ లో ఉంది అకీరా పేరే. మరి అకీరా సినిమా ల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ.. అకీరా క్రేజ్ మాములుగా లేదు అంటున్నారు.

 

 

Tags:    

Similar News