అఖిల్ పక్కన డాక్టర్ పిల్ల..!

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా సినిమా గత ఏడాది విడుదలై నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. టాక్సీ డ్రైవర్ గా విజయ్ దేవరకొండ [more]

Update: 2019-02-27 06:58 GMT

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా సినిమా గత ఏడాది విడుదలై నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. టాక్సీ డ్రైవర్ గా విజయ్ దేవరకొండ నటన అద్భుతం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవల్కర్ తెలుగమ్మాయి. అనంతపురం అమ్మాయి అయిన ప్రియాంక జవల్కర్ టాక్సీవాలా సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. డాక్టర్ పిల్లగా గ్లామర్ నటనతో అదరగొట్టింది. అయితే టాక్సీవాలా తర్వాత ప్రియాంక పేరు చాలా హీరోల పక్కన వినిపించినా ఫైనల్ గా రవితేజ డిస్కోరాజాలో గట్టిగా వినబడింది.

అఖిల్ సినిమాలో ఛాన్స్

తాజాగా అక్కినేని యంగ్ హీరో పక్కన కూడా ప్రియాంక పేరు వినబడుతుంది. మూడు సినిమాల ఫ్లాప్స్ తో ఉన్న అఖిల్ అక్కినేని తన నాలుగో సినిమాని త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకతంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ నాలుగో సినిమా తెరకెక్కబోతుందనేది టాక్. అధికారిక ప్రకటన రాకపోయినా గీత ఆర్ట్స్ – బొమ్మరిల్లు భాస్కర్ – అఖిల్ మూవీ పక్కా అని తెలుస్తుంది. అఖిల్ సినిమాలో సయేశా సైగల్ తో రొమాన్స్ చేసిన అఖిల్, హలో సినిమాలో కళ్యాణి ప్రియదర్శి తో, మిస్టర్ మజ్నులో నిధి అగార్వల్ తో కలిసి నటించాడు.

నిజమే అయితే లక్కీనే…

మరి నాలుగో సినిమాలో టాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవల్కర్ తో అఖిల్ రొమాన్స్ చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ప్రియాంక జవల్కర్ ని సంప్రదించినట్లుగా ఫిలింనగర్ టాక్. మరి టాక్సీవాలా తర్వాత మరో సినిమా చేతిలో లేని ప్రియాంకకి అఖిల్ పక్కన గనుక ఛాన్స్ నిజమే అయితే అమ్మడుకి అదృష్టం తలుపు తట్టేసినట్లే.

Tags:    

Similar News