ఇంతకీ నాగార్జున కేమైనట్టు?

మన్మధుడు 2 సినిమా ప్లాప్ తర్వాత నాగార్జున ఎందుకో చాలా సైలెంట్ గా ఉన్నాడు. సినిమా ఇచ్చిన షాక్ తో నాగార్జున ఆలా ఉన్నాడేమో అనుకున్నారు… కానీ [more]

Update: 2019-08-28 12:17 GMT

మన్మధుడు 2 సినిమా ప్లాప్ తర్వాత నాగార్జున ఎందుకో చాలా సైలెంట్ గా ఉన్నాడు. సినిమా ఇచ్చిన షాక్ తో నాగార్జున ఆలా ఉన్నాడేమో అనుకున్నారు… కానీ నాగార్జున కు ఆరోగ్యం దెబ్బతినట్టుగా … కీళ్ల నొప్పులు తో బాధపడుతున్నట్టుగా నిన్నటినుండి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది. నాగార్జున ఆరోగ్యంపై రకరకాల పుకార్లు సోషల్ ఇండియాలో ప్రచారంలోకి రావడంతో అక్కినేని అభిమానులు ఒకింత షాక్ కి గురయ్యారు. ఇక నాగార్జున మన్మధుడు 2 కోసం కాస్త ఏజ్ తక్కువ వాడిలా కనిపించడానికి చాలా డైట్ చేసాడని, అలాగే చాలా వర్కౌట్స్ చెయ్యడంతో నాగార్జున ఆరోగ్యం బాగా దెబ్బతిందనే ప్రచారం మాములుగా జరగలేదు.

వైరల్ ఫీవర్ మాత్రమే…..

అయితే ఈ గాసిప్స్ పై నాగార్జున నేరుగా స్పందించకుండా తన అభిమానుల ద్వారా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయించాడు. ఆదేమిటంటే నాగార్జున కు కేవలం వైరల్ ఫీవర్ వచ్చిందని, ఈ వర్షాకాలంలో అందరికి వచ్చే నార్మల్ ఫీవర్ అని… తన ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన పడొద్దని పోస్ట్ పెటించడంతో.. నాగార్జున ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. పాపం నాగార్జున తనకొచ్చిన ఫీవర్ వలన హైదరాబాద్ లోనే తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు.

Tags:    

Similar News