అలియా – రణబీర్ పెళ్లి అందుకే ఆగింది
బాలీవుడ్ లో ప్రేమ పక్షుల్లా తిరుగుతన్న అలియా భట్ కానీ, రణబీర్ కపూర్ కానీ పెళ్లి విషయంలో క్లారిటీ లేకుండా తిరిగారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న [more]
బాలీవుడ్ లో ప్రేమ పక్షుల్లా తిరుగుతన్న అలియా భట్ కానీ, రణబీర్ కపూర్ కానీ పెళ్లి విషయంలో క్లారిటీ లేకుండా తిరిగారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న [more]
బాలీవుడ్ లో ప్రేమ పక్షుల్లా తిరుగుతన్న అలియా భట్ కానీ, రణబీర్ కపూర్ కానీ పెళ్లి విషయంలో క్లారిటీ లేకుండా తిరిగారు. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న రణబీర్ కపూర్ – అలియా భట్ ల పెళ్లిపై అదిగో ఇదిగో అంటూ మీడియా లో వార్తలు రావడమే కానీ.. ఈ జంట మాత్రం పెళ్లిపై స్పందించదు. కానీ తాజాగా రణబీర్ కపూర్ అలియాతో పెళ్లిపై ఇచ్చి ఇవ్వని స్పష్టతనిచ్చాడు. ఓ ఇంటర్వ్యూ లో రణబీర్ కపూర్ మాట్లాడుతూ కరోనా లేకపోతె ఈపాటికే తాము పెళ్లితో ఒక్కటయ్యేవాళ్లమంటూ చెప్పడంతో.. త్వరలోనే రణబీర్ కపూర్ – అలియా భట్ లు పెళ్లి పీటలెక్కడం ఖాయమని అభిమానులు డిసైడ్ అయ్యారు.
అలియా తో పెళ్లి ఖాయమని.. కాకపోతే ఇప్పుడు పెళ్లిపై అంత కన్నా ఇంకేం చెప్పలేనని.. కాకపోతే త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నట్టుగా చెప్పిన రణబీర్ ని చూస్తే అలియా భట్ – రణబీర్ కపూర్ ల పెళ్లి పక్కా అని తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరూ ఎప్పుడూ ప్రేమ పక్షుల్లా చూసిన వారు పెళ్లికి చేసుకోవచ్చుకదా అంటుంటారు. ఇక అలియా భట్ – రణబీర్ కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క అలియా భట్ పాన్ ఇండియా మూవీ RRR సీతగా నటించబోతుంది. ఇప్పటికే అలియా భట్ RRR సెట్స్ లో జాయిన్ కూడా అయ్యింది.