అలియా పార్టీలో ప్రియుడు మిస్సింగ్

కరోనా లేకపోతె గత ఏడాది బాలీవుడ్ లో లవర్స్ గా పేరు తెచ్చుకున్న రణబీర్ కపూర్- అలియా భట్ లు ఈపాటికి ఓ ఇంటి వారయ్యేవారు. కానీ [more]

Update: 2021-03-15 09:25 GMT

కరోనా లేకపోతె గత ఏడాది బాలీవుడ్ లో లవర్స్ గా పేరు తెచ్చుకున్న రణబీర్ కపూర్- అలియా భట్ లు ఈపాటికి ఓ ఇంటి వారయ్యేవారు. కానీ కరోనా లాక్ డౌన్ అంటూ వాళ్ళ పెళ్లి మేటర్ పోస్ట్ పోన్ అయ్యింది. ఇక అర్జున్ కపూర్ తో పెళ్లికన్నా ఇలా షికార్లు తిరగడమే మలైకాకి నచ్చుతుంది. కాబట్టే పెళ్లి ఊసెత్తడం లేదు.

ఇక రీసెంట్ గా పబ్లిక్ చూస్తుండగానే అర్జున్ కపూర్, మలైకా అరోరా ఒకే కారులో అలియా భట్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హాజరవడం హాట్ టాపిక్ అయ్యింది. గత రాత్రి బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ బర్త్ డే వేడుకలు కరణ్ జోహార్ ఇంట్లో అదిరిపోయే రేంజ్ లో జరిగి ఉంటాయనేది.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోస్ చూస్తే అర్ధమవుతుంది. అలియా భట్ దగ్గర నుండి అర్జున్ కపూర్, మాలిక అరోరా, రణ్వీర్ సింగ్ లాంటి సెలబ్రిటీస్ ఈ అలియా పుట్టిన రోజు వేడుకల కోసం కరణ్ జోహార్ రెసిడెన్సీకి క్యూ కట్టారు. అందులో మలైకా అరోరా – అర్జున్ ఒకే కారులో రావడాన్ని ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించారు. మరి అలియా బర్త్ డే పార్టీలో ఆమె ప్రియుడు రణబీర్ మిస్ అయ్యాడు. ఎందుకంటే రణబీర్ కి కరోనా సోకినా కారణంగా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాడు కాబట్టి.

Tags:    

Similar News