ఆ సెంటర్స్ లో గోదారమ్మ గంతులేస్తుంది

వాల్మీకి సినిమాలో హారిష్ శంకర్, వరుణ్ తేజ్ – పూజ హెగ్డే లతో వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నాడు అనగానే… అప్పట్లో సూపర్ క్లాసిక్ [more]

Update: 2019-09-23 07:19 GMT

వాల్మీకి సినిమాలో హారిష్ శంకర్, వరుణ్ తేజ్ – పూజ హెగ్డే లతో వెల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నాడు అనగానే… అప్పట్లో సూపర్ క్లాసిక్ గా శోభన్ బాబు – శ్రీదేవి లు కలిసి పాడిన పాటను హారిష్ శంకర్ పాడు చేస్తున్నాడని అన్నారు. అంత క్లాసిక్ సాంగ్ ని రీమిక్స్ చేసి చెడగొడతాడన్నారు. కానీ గద్దలకొండ గణేష్ సినిమా విడుదలయ్యాక సినిమాలో వెల్లువొచ్చే గోదారమ్మ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. మరి ప్రేక్షకుల ఎదురు చూపులకు తగ్గట్టుగా ఆ సాంగ్ విపరీతంగా ప్రేక్షకులకు ఫుల్ గా ఎక్కేసింది. ఆ సాంగ్ లో పూజ హెగ్డే లుక్, గ్లామర్, వరుణ్ స్టెప్స్ అన్ని మాస్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది.

ఖుషీ….ఖుషీగా….

థియేటర్స్ లో సాంగ్ రాగానే మాస్ ప్రేక్షకులు లేచి మరీ డాన్స్ చేస్తూ విజిల్స్ వేస్తూ హంగామా చేస్తున్నారు. ఇక పూజ హెగ్డే కనిపించనప్పటి నుంచి ఆ సాంగ్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారో.. ఆ సాంగ్ రాగానే అంతగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి హరీష్ సాహసం చేసి రీమిక్స్ చేసిన ఆ సాంగ్ అంతలా మార్మోగిపోవడంతో వాల్మీకి యూనిట్ మొత్తం ఫుల్ ఖుషిలో మునిగితేలుస్తున్నారు.

 

Tags:    

Similar News