పుష్పకి అలా అలా.. కానీ కొరటాల మూవీకి మాత్రం?

సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు. కరోనా సర్దుమణిమనగడమే తరువాయి పుష్ప యూనిట్ మొత్తం గలగలమంటూ సెట్స్ [more]

Update: 2020-08-26 04:53 GMT

సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు. కరోనా సర్దుమణిమనగడమే తరువాయి పుష్ప యూనిట్ మొత్తం గలగలమంటూ సెట్స్ మీదకెళ్ళిపోతుంది. అడవుల్లో ఫస్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన సుకుమార్ తర్వాత మిగతా షూటింగ్ ప్లాన్ చేస్తాడట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ నుండి చాలామంది నటుల్ని సౌత్ ఇండియా వాళ్లనే తీసుకోబోతున్నాడట సుకుమర్. పాన్ ఇండియా మూవీ అయినా.. ఎక్కువగా బాలీవుడ్ నటులు అవసరం లేదని.. ఎలాగూ హీరోయిన్ రశ్మికని తీసుకున్నాం కాబట్టి ఐటెం గర్ల్ గా బాలీవుడ్ భామని దించుదామని, అలాగే సినిమాలోని ముఖ్యమైన కీలక పాత్రలకు ఇక్కడ సౌత్ ఇండియా నటులనే సుకుమార్ ఎంపిక చేసినట్టుగా టాక్. చాలా కొద్దిమంది బాలీవుడ్ నటులే పుష్ప లో కనిపిస్తారట.

అయితే కరోనా లాక్ డౌన్ లో అల్లు అర్జున్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తో మరో పాన్ ఇండియా మూవీని ఎనౌన్స్ చేసాడు. అయితే కొరటాలాతో బన్నీ చెయ్యబోయే సినిమా లో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ ఉండబోతున్నారట. హీరోయిన్ దగ్గరనుండి.. కీలక పాత్రలను కూడా బాలీవుడ్ వాళ్లనే తీసుకోబోతున్నారట.బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ పేర్లు బన్నీ కోసం కొరటాల పరిశీలనలో ఉన్నాయట. అలాగే ఐటెం సాంగ్ లో కూడా బాలీవుడ్ హీరోయిన్ నే తీసుకుంటారట. ఇక విలన్ వగైరా పాత్రలు కూడా బాలీవుడ్ నుండే దింపుతారట. మరి సుకుమార్ సౌత్ ని నమ్ముకుని పాన్ ఇండియా కి వెళుతుంటే.. కొరటాల మాత్రం బాలీవుడ్ నే నమ్ముతున్నాడన్నమాట.  

Tags:    

Similar News