మహేష్ పార్టనర్ తో అల్లు అర్జున్ కూడా మొదలెట్టేసాడు..!

మహేష్ బాబు ఒక పక్క సినిమాలతో బిజీగా ఉండడమే కాదు… మరోపక్క యాడ్స్ షూట్స్ అంటూ పర్సనల్ బిజినెస్ తో పాటుగా కొత్తగా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి [more]

Update: 2019-02-14 05:58 GMT

మహేష్ బాబు ఒక పక్క సినిమాలతో బిజీగా ఉండడమే కాదు… మరోపక్క యాడ్స్ షూట్స్ అంటూ పర్సనల్ బిజినెస్ తో పాటుగా కొత్తగా మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ఎంటరయ్యాడు. ఏషియన్ సునీల్ తో కలిసి ఏఎంబీ సినిమాస్ అంటూ మల్టీప్లెక్స్ ని నిర్మించాడు. ఇక ఏఎంబీ మాల్ ని ఏషియన్ సునీల్ తో పార్టనర్ గా వ్యాపారం మొదలు పెట్టిన మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏఎంబీ మల్టిప్లెక్స్ బిజినెస్ కి రంగం సిద్ధం చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన నగరాల్లో మహేష్.. ఏషియన్ సునీల్ తో కలిసి ఈ మల్టిప్లెక్స్ నిర్మాణాలు మొదలెట్టాడు. తాజాగా మహేష్ బాటలో అల్లు అర్జున్ కూడా నడుస్తున్నాడు. ఇప్పటికే అమీర్ పేట్ నడిబొడ్డున గతంలో సత్యం థియేటర్ ఉన్న ప్లేస్ లో ఏఏఏ అంటూ ఒక మల్టిప్లెక్స్ నిర్మాణం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

రాష్ట్రమంతా మొదలు పెట్టాలని…

అయితే ఆ ఏఏఏ మల్టిప్లెక్స్ ని అల్లు అర్జున్ ఏషియన్ సునీల్ తోనే పార్ట్ నర్ షిప్ లో కట్టబోతున్నాడు. కేవలం ఈ అమీర్ పేట్ లోనే కాదు… ఈ మల్టిప్లెక్స్ బిజినెస్ ని అల్లు అర్జున్ రాష్ట్రమంతా ప్రారంభించాలని యోచిస్తున్నాడు. కేవలం ఆలోచనే కాదు.. ఇప్పటికే ఏషియన్ సునీల్ తో కలిసి అల్లు అర్జున్ డీల్ పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలతో పాటుగా ఈ మల్టిప్లెక్స్ బిజినెస్ చూసుకోవడం కుదరదు కనుక ఇప్పుడు ఈ వ్యాపారాన్ని అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్ కే అప్పగించబోతున్నాడట. ఏఏఏలో కేవలం అల్లు అర్జున్ పెట్టుబడి మాత్రమే పెడతాడట. మిగతా విషయాలన్నీ అల్లు అరవింద్ పేరు మీద ఉంటాయట. మరి మహేష్ పార్టనర్ అయిన ఏషియన్ సునీల్ ఇప్పుడు అల్లు అర్జున్ కి కూడా పార్ట్నర్ అయ్యాడన్నమాట.

Tags:    

Similar News