మా మధ్య విభేదాలు లేవు..!

అల్లు అర్జున్ కి, ఆయన తండ్రి అల్లు అరవింద్ కి మధ్యన అభిప్రాయబేధాలు వచ్చాయని.. అందుకే గీత ఆర్ట్స్ బ్యానర్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ఉన్నప్పటికీ.. [more]

Update: 2019-05-02 08:40 GMT

అల్లు అర్జున్ కి, ఆయన తండ్రి అల్లు అరవింద్ కి మధ్యన అభిప్రాయబేధాలు వచ్చాయని.. అందుకే గీత ఆర్ట్స్ బ్యానర్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ఉన్నప్పటికీ.. బన్నీ సొంత బ్యానర్ స్థాపించబోతున్నాడని.. అందుకే స్వంతంగా జూబ్లీహిల్స్ లో ఆఫీస్ ఓపెన్ చేసాడనే ప్రచారం జరిగింది. ఇక సినిమాలే కాకుండా అల్లు అర్జున్ వ్యాపారంలోకి కూడా దిగాడు. పబ్స్, రెస్టారెంట్స్, మల్టిప్లెక్స్ బిజినెస్ లు చేస్తున్నాడు. ఇవన్నీ అల్లు అరవింద్ మీద కోపంతోనే అల్లు అర్జున్ చేస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అయితే తండ్రీకొడుకుల మధ్యన విభేదాల వార్తలపై అల్లు అర్జున్ చాలా లేట్ గా స్పందించాడు.

పుకార్లు విని నవ్వుకుంటాం…

తన తండ్రితో తనకు విభేదాలున్నాయనేది వాస్తవం కాదని… ఇప్పటికీ తన ఫ్యామిలీ అంటే స్నేహ, అర్హ, అయాన్ అంతా కలిసి తండ్రి కుటుంబంతోనే ఉంటోందని తెలిపాడు. అంతేకాదు ప్రతిరోజు తామిద్దరం కలుసుకుంటామని, ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు ఎంచక్కా నవ్వుకుంటామని కూడా అన్నాడు. ఇటీవలే ఒక అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఈ విషయం చెప్పాడు. మరి అర్జున్ చెబుతున్నది నిజమే అయినా.. ఇంకా బయట మాత్రం ఏళ్లుగా అర్జున్ కి, అల్లు అరవింద్ కి పొసగడం లేదని అందుకే అల్లు అర్జున్ వేరు కుంపటి పెట్టబోతున్నాడనే న్యూస్ కి మాత్రం బ్రేక్ పడడం లేదు.

Tags:    

Similar News